జంగారెడ్డిగూడెంలో వ్యక్తి దారుణ హత్య

Man attacked on road and Brutally killed in West Godavari.ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Sep 2021 8:18 AM GMT
జంగారెడ్డిగూడెంలో వ్యక్తి దారుణ హత్య

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. తాను ప్రేమించిన యువ‌తిని బైక్‌పై ఎక్కించుకున్నాడ‌నే కార‌ణంతో ఓ యువ‌కుడు మోడల్ డైరీ డిస్ట్రిబ్యూటర్ సురేష్‌ను దారుణంగా క‌త్తితో పొడిచి హ‌త‌మార్చాడు. ఈ ఘ‌ట‌న జంగారెడ్డిగూడెంలోని మున‌స‌బుగారి వీధిలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. మోడల్ డైరీ డిస్ట్రిబ్యూటర్ సురేష్ నిన్న రాత్రి త‌న పాల డైరీలో ప‌ని చేస్తున్న ఓ యువ‌తిని ద్విచ‌క్ర‌వాహ‌నంపై ఎక్కించుకుని ఆమె ఇంటి వ‌ద్ద వ‌దిలిపెట్టాడు. అయితే.. తాను ప్రేమించిన యువ‌తిని సురేశ్ బైక్‌పై ఎక్కించుకున్నాడ‌నే కోపంతో ఓ యువ‌కుడు.. అర్థ‌రాత్రి స‌మ‌యంలో క‌త్తితో దాడికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌నలో సురేశ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. గ‌మ‌నించిన స్థానికులు అత‌డిని 108 సాయంతో చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం మెరుగైన చికిత్స కోసం విజ‌య‌వాడ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ.. సురేష్ మృతి చెందాడు. కాగా.. ఈ ఘ‌ట‌న మొత్తం స్థానికంగా ఉన్న‌సీసీకెమెరాల్లో రికార్డు అయ్యింది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టారు.

Next Story
Share it