రన్నింగ్ ట్రైన్‌లో యువతి పట్ల అసభ్య ప్రవర్తన, కామాంధుడు అరెస్ట్
రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌లో ఓ యువకుడు రెచ్చిపోయి ప్రవర్తించాడు.
By Srikanth Gundamalla Published on 7 Aug 2024 1:30 PM ISTరన్నింగ్ ట్రైన్‌లో యువతి పట్ల అసభ్య ప్రవర్తన, కామాంధుడు అరెస్ట్
రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌లో ఓ యువకుడు రెచ్చిపోయి ప్రవర్తించాడు. విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా.. సదురు యువతి తిరగబడింది. ఆ తర్వాత తోటి ప్రయాణికుల సాయంతో ఏకి పారేసింది. చివరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
మంగళవారం రాత్రి 2 గంటలు దాటిన తర్వాత రైలు ఏపీలోని సామర్లకోట స్టేషన్ సమీపానికి చేరుకుంది. ఆ సమయంలో యువతి గాఢ నిద్రలో ఉంది. అప్పుడే ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వెళ్లాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆమెను తాకడం మొదలుపెట్టాడు. లైంగిక దాడికి ప్రయత్నించే సమయంలోనే ఆ యువతి ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. గట్టిగా కేకలు వేస్తూ దుండగుడిప తిరగబడింది. విద్యార్థిని అరుపులు విన్న తోటి ప్రయాణికులు ఆమె వద్దకు వెళ్లారు. జరిగిన విషయాన్నంతా ఆమె తోటి ప్రయాణికులతో చెప్పింది. అందరూ కలిసి కామాంధుడిని పట్టుకున్నారు. ఆ తర్వాత అతడిని చితకబాదినట్లు తెలిసింది. తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు ట్రైన్ విశాఖపట్నం చేరుకుంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న వారు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ట్రైన్‌లో కలకలం రేపింది. రైలు హౌరా నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.