స‌భ్య స‌మాజం సిగ్గుతో త‌ల‌దించుకోవాల్సిన ఘ‌ట‌న.. ఆవుపై అత్యాచారం..!

Man Arrested For Raping Cow in Sonipat.సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది. మానవత్వానికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Nov 2021 11:29 AM GMT
స‌భ్య స‌మాజం సిగ్గుతో త‌ల‌దించుకోవాల్సిన ఘ‌ట‌న.. ఆవుపై అత్యాచారం..!

దేశంలో ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి కామాంధుల్లో మార్పు రావ‌డం లేదు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది. మానవత్వానికి మచ్చ తెచ్చే దారుణ ఉదంతమిది. దేశంలో అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. ప‌సిబాల‌లు, పండు ముసలివాళ్లపై దారుణాలకు పాల్పడుతున్న కామాంధులు.. చివరకు మూగజీవాలను కూడా వదలడం లేదు. ఈ దారుణ ఘ‌ట‌న హ‌ర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. సోనీపట్ జిల్లాలోని లివాస్పూర్ గ్రామంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ వ్య‌క్తి అద్దెకు ఉంటున్నాడు. ఆ ఇంట్లో ఉన్న ఆవుపై అత్యాచారానికి పాల్ప‌డుతుండ‌గా.. గ‌మ‌నించిన స్థానికులు అత‌డి ప‌ట్టుకున్నారు. అత‌డికి దేహ‌శుద్ది చేసిన అనంత‌రం పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసు అధికారి అశోక్ మాట్లాడుతూ.. ఓ యువ‌కుడు ఆవుపై అత్యాచారానికి పాల్ప‌డ్డనే స‌మాచారం అందింద‌న్నారు. ఆవు య‌జ‌మాని ఫిర్యాదు మేర‌కు.. నిందితుడిని అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు. అత‌డిని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన అసిమ్‌గా గుర్తించామ‌న్నారు. జంతు హింస చ‌ట్టం 377కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని చెప్పారు.

Next Story
Share it