లిఫ్ట్ ఇస్తానని నమ్మించి అక్కపై అత్యాచారం.. చెల్లెళ్లను కారులో బంధించి..

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఈద్ మేళా చూసి ఇంటికి తిరిగి వెళ్తున్న 19 ఏళ్ల యువతి...

By -  అంజి
Published on : 25 March 2026 8:28 AM IST

Baghpat Rape Case, Uttar Pradesh Crime News, Lift Giving Crime, Bharatiya Nyaya Sanhita, Eid Fair Incident, Crime Against Women, Baghpat Police Arrest

లిఫ్ట్ ఇస్తానని నమ్మించి అక్కపై అత్యాచారం.. చెల్లెళ్లను కారులో బంధించి.. 

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఈద్ మేళా చూసి ఇంటికి తిరిగి వెళ్తున్న 19 ఏళ్ల యువతి, ఆమె ఇద్దరు చిన్న చెల్లెళ్లను టార్గెట్ చేసిన ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. దీపక్ అనే నిందితుడు వారిని ఇంటి వద్ద దింపుతానని నమ్మించి తన కారులోకి ఎక్కించుకున్నాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు ప్రకారం.. నిందితుడు ప్లాన్ ప్రకారం ఆరు, పన్నెండేళ్ల వయసున్న చిన్నారి సోదరీమణులను కారులోనే లాక్ చేశాడు. అనంతరం పెద్దమ్మాయిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, ఆయుధంతో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. భయంతో వణికిపోయిన ఆ యువతి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే, రెండు రోజుల తర్వాత ఆ చిన్న పిల్లలు జరిగిన విషయాన్ని తమ తల్లికి వివరించడంతో అసలు నిజం బయటపడింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితుడైన దీపక్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసు నమోదు చేసి, అతడిని కటకటాల వెనక్కి నెట్టారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

Next Story