హోటల్‌లో శవమై కనిపించిన నటుడు
మలయాళ టీవీ నటుడు దిలీప్ శంకర్ తిరువనంతపురంలోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించాడు.
By అంజి
హోటల్‌లో శవమై కనిపించిన నటుడు
మలయాళ టీవీ నటుడు దిలీప్ శంకర్ తిరువనంతపురంలోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించాడు. కొనసాగుతున్న సీరియల్ షూటింగ్ కోసం నటుడు నగరంలో ఉన్నారు. మేకర్స్ ప్రకారం.. అతను చివరిగా రెండు రోజుల క్రితం సెట్‌ని వెళ్లాడు. మేకర్స్ ప్రకారం.. షూట్‌లో విరామం ఉంది. ఈ క్రమంలోనే దిలీప్ తిరిగి సెట్‌లో చేరడానికి హోటల్‌లో బస చేశాడు. అతను కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని అతని సహచరులు పేర్కొన్నారు. పోలీసులు విచారణ ప్రారంభించారు.
గదిలో నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది అతని మృతదేహాన్ని గుర్తించారు. అమ్మయారియతే, పంచాగ్ని వంటి ప్రముఖ టీవీ సీరియల్స్‌లో తన పాత్రలకు పేరుగాంచిన దిలీప్, అతను బస చేసిన సమయంలో తన గది నుండి బయటకు వెళ్లడం కనిపించలేదు. ప్రాథమిక నివేదికలు.. అనుమానాస్పద సంకేతాలను సూచిస్తున్నప్పటికీ, అధికారులు అతని మరణానికి కారణాన్ని పరిశీలిస్తున్నారు.
దిలీప్ ఆకస్మిక మరణం మలయాళ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. టీవీ సీరియల్స్, సినిమాలు రెండింటిలోనూ బహుముఖ ప్రదర్శనలకు పేరుగాంచిన దిలీప్ అభిమానులకు ప్రియమైనవాడు. అతను చివరిసారిగా కొనసాగుతున్న పంచాగ్ని సీరియల్‌లో చంద్రసేనన్ పాత్రలో కనిపించాడు. ఇటీవలే అమ్మయారియతేలో పీటర్ పాత్రకు ప్రశంసలు అందుకున్నాడు. విచారణ ఇంకా కొనసాగుతోంది.