దారుణం.. మహిళ హత్య, శరీరం ముక్కలను రెండు రైళ్లలో..

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

By Srikanth Gundamalla  Published on  24 Jun 2024 8:30 AM IST
madhya Pradesh, indore, man, murder, woman,

దారుణం.. మహిళ హత్య, శరీరం ముక్కలను రెండు రైళ్లలో..

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి విఫలయత్నం చేశాడు. దాంతో ఆమెను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత శరీర భాగాలను రెండు రైళ్లలో వదిలేశాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఉజ్జయిని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 37 ఏళ్ల ఒక మహిళ భర్తతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చింది. మథురలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఇక ఆమె ఒంటరిగా ఉండటాన్ని అక్కడే ఉన్న కమలేశ్‌ పటేల్ (60) గుర్తించాడు. ఆ తర్వాత ఆమె దగ్గరకు వెళ్లి మాటలు కలిపాడు. మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకు వెళ్లాడు. ఇక ఆహారం తీసుకోవాలని.. నీరసంగ ఉన్నావంటూ చెప్పాడు. దాంతో.. పెద్దాయన హెల్ప్ చేస్తున్నాడు అనుకుని ఆమె కూడా ఆహారాన్ని తిన్నది. కానీ.. అప్పటికే ఆ కామాంధుడు ఆహారంలో నిద్ర మాత్రలు కలిపాడు. దాంతో.. ఆమె నిద్రపోయింది. ఇదు అదునుగా భావించిన కమలేశ్‌ ఆ మహిళపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.

ఉన్నట్లుండి మహిళ మేల్కొంది. కమలేవ్‌ దుర్భుద్దిని గమనించి వెంటనే కేకలు వేసింది. దాంతో.. కంగారుపడ్డ కమలేశ్ ఆగ్రహంతో మహిళను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత డెడ్‌బాడీని రెండు ముక్కలుగా చేశాడు. వాటిని రెండు వేర్వేరు రైళ్లలో ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి వదిలేశాడు. ఇండోర్-నాగ్దా, ఇండోర్-డెహ్రాడూన్ రైళ్లలో శరీరం భాగాలను పడేశాడు. ఒక రైలు ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌కు చేరుకున్నాక.. మరో రైలు మధ్య్రదేశ్‌లోని ఇండోర్‌కు చేరుకున్నాక ఆ సంచులను గమనించారు. ఈ దారుణం బయటకు వచ్చింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనస్థలానాకి చేరుకుని శరీర భాగాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. ఇక చివరకు దర్యాప్తు చేసి కేసును ఛేదించినట్లు చెప్పారు. నిందితుడిని కూడా అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.

Next Story