దారుణం: గర్భిణిపై సామూహిక అత్యాచారం.. తర్వాత నిప్పంటించి..
మధ్యప్రదేశ్‌లోని మొరానా జిల్లాలో శుక్రవారం ఈ దారుణ సంఘటన జరిగింది.
By Srikanth Gundamalla Published on 18 Feb 2024 8:45 AM ISTదారుణం: గర్భిణిపై సామూహిక అత్యాచారం.. తర్వాత నిప్పంటించి..
మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రోజూ అత్యాచార సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని చోట్ల తెలియనవారు అఘాయిత్యాలకు పాల్పడితే.. ఇంకొన్ని సందర్భాల్లో అయినవారే లైంగిక దాడులు చేస్తున్నారు. అమ్మాయిలను నరకానికి గురిచేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో దారుణ సంఘటన జరిగింది. ఒక గర్భిణిపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను చంపేందుకు కిరోసిన్ పోసి నిప్పంటించారు.
మధ్యప్రదేశ్‌లోని మొరానా జిల్లాలో శుక్రవారం ఈ దారుణ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి భర్త ఒక లైంగిక దాడిర కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇటీవల జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలోనే తన భర్తపై లైంగిక దాడి కేసు పెట్టిన మహిళతో రాజీ కుదిర్చేందుకు బాధితురాలు ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా కేసు పెట్టిన మహిళ ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమె ఇంట్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. లైంగిక దాడి కేసులో ఉన్న వ్యక్తి బార్యను అని చెప్పడం.. రాజీకోసం వచ్చానని చెప్పింది. దాంతో.. ముగ్గురు వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణి అని కూడా చూడకుండా లైంగిక దాడికి పాల్పడ్డారు. అదే ఆవేశంలో గర్భిణిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు.
ఇక స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. 80 శాతం గాయాలు కావడంతో బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషయమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చావు బతకుల మధ్య పోరాడుతోంది. ఇక మెజిస్ట్రేట్ సమక్షంలో బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.