ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన.. రైలు కింద‌ప‌డి ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌

Loves suicide in prakasham Dist.ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 March 2021 1:54 PM IST
Lovers suicide in prakasham Dist

ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పెళ్లికి పెద్ద‌లు ఒప్పుకోలేదనో లేదా పెద్దలను ఎదిరించలేక‌నో ప్రేమజంట ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఒంగోలు న‌గ‌ర శివారులోని పెళ్లూరు వ‌ద్ద చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌పై ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నారు. వేగంగా రైలు ఢీ కొట్ట‌డంతో మృత‌దేహాలు పూర్తిగా చిద్ర‌మ‌య్యాయి.

మృత‌దేహాల‌ను ప‌రిశీలించిన పోలీసులు వాటిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. యువ‌కుడిని చీమ‌కుర్తి మండ‌లం గుడివాడ గ్రామానికి చెందిన మ‌ద్ది వెంక‌ట‌సాయి కృష్టగా గుర్తించారు. యువ‌తి స్వ‌స్థ‌లం చీమ‌కుర్తిగా భావిస్తున్నారు. వారిద్ద‌రు ఒంగోలులోని దామ‌చ‌ర్ల ఆంజ‌నేయులు పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో చ‌దువుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక వీరు ఎందుకు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు అనే కార‌ణం తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Next Story