విషాదం.. కారులో సజీవ దహనమైన ప్రేమజంట
Lovers committed suicide burn themselves inside the car.ఇటీవల కాలంలో ప్రేమికులు ఆత్మహత్యలకు
By తోట వంశీ కుమార్ Published on 14 Aug 2021 11:40 AM ISTఇటీవల కాలంలో ప్రేమికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాము ప్రేమించిన వారితో పెద్దలు పెళ్లికి ఒప్పుకోవడం లేదనో, మోసపోయామనే కారణంతోనో ఏదైనప్పటికి ప్రేమికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదనే కారణంతో ప్రేమికులు కారులో కూర్చొని నిప్పంటించుకుని సజీవ దహనానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మాంబళ్లికి చెందిన కాంచన (20), శ్రీనివాస్ (26) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాంచన నర్సుగా పనిచేస్తుండగా శ్రీనివాస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారి ప్రేమను పెద్దలకు చెప్పారు. అయితే.. వారి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో శుక్రవారం సాయంత్రం మాంబల్లి సమీపంలోని కినకహళ్లి గ్రామ చెరువు వద్దకు కారులో చేరుకున్నారు. కొంతసేపు అక్కడి సమయం గడిపారు. అనంతరం కారులో కూర్చొని కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. వారిద్దరు సజీవ దహనం అయ్యారు. వారి శరీరాలు కాలి బూడిదగా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చామరాజనగర్ ఎస్పీ దివ్య సారా థామస్ సంఘటానా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే ప్రేమికులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారా..? మరి ఇంకేదైనా కారణం ఉందా..? అన్న కోణంలో విచారణ చేపట్టారు.