విషాదం.. నల్లగొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
Lovers commits suicide in Nalgonda.తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోవట్లేదని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడుతున్న
By తోట వంశీ కుమార్ Published on
24 Oct 2021 5:34 AM GMT

తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోవట్లేదని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. కాస్త సమయం తీసుకోని అయిన సరే పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాల్సింది పోయి.. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. తమ ప్రేమకు పెద్దలు అడ్డుచెబుతున్నారని ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళితే.. అనుముల మండలం తెట్టేకుంట గ్రామానికి చెందిన మట్టపల్లి కొండలు(21), సంధ్య(19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వీరి విషయం ఇరు కుటుంబాల్లో తెలిసింది. అయితే.. వీరిని ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో మనస్థాపానికి గురైన ప్రేమజంట రెండు రోజుల క్రితం గ్రామ శివారులో పురుగుల మందు తాగారు. వీరిని గుర్తించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా.. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. ప్రేమజంట మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story