పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
Lorry over Turned in West Godavari District four dead.పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల
By తోట వంశీ కుమార్ Published on
14 Jan 2022 3:04 AM GMT

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడుతో వెలుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. నారాయణపురం నుంచి దువ్వాడకు చేపల లోడుతో లారీ వెలుతోంది. శుక్రవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎన్ఐటీ సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో నలుగురు కూలీలు అక్కడిక్కడే మరణించగా.. మరో ఏడుగురు కూలీలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చునని బావిస్తున్నారు.
Next Story