ఓఆర్ఆర్ పై నుంచి కింద ఉన్న గుడిసెలపై పడిన లారీ.. ముగ్గురి మృతి

ఔట‌ర్ రింగురోడ్డుపై వేగంగా వెలుతున్న లారీ అదుపు త‌ప్పి స‌ర్వీస్ రోడ్డు ప‌క్క‌నే ఉన్న గుడిసెల‌పై ప‌డింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2023 8:46 AM IST
ఓఆర్ఆర్ పై నుంచి కింద ఉన్న గుడిసెలపై పడిన లారీ.. ముగ్గురి మృతి

ఓ లారీ బీభ‌త్సం సృష్టించింది. ఔట‌ర్ రింగురోడ్డుపై వేగంగా వెలుతున్న లారీ అదుపు త‌ప్పి స‌ర్వీస్ రోడ్డు ప‌క్క‌నే ఉన్న గుడిసెల‌పై ప‌డింది. ఈ ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లా కొల్లూరు వ‌ద్ద ఔట‌ర్ రింగురోడ్డు వ‌ద్ద జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతి చెందారు.

బియ్యం లోడుతో హర్యానా నుంచి చిత్తూరుకు వెలుతున్న లారీ సంగారెడ్డి జిల్లా కొల్లూర్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్‌ పాయింట్‌ -2 దగ్గర అదుపు త‌ప్పింది. ఓ ఆర్ఆర్ఆర్ పై నుంచి కింద ఉన్న గుడిసెల‌పై ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతి చెందారు. గురువారం తెల్ల‌వారుజామున ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

ఈ ఘటనతో నిరుపేదలు నివసించే ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. తెల్లవారుజామున నిద్రలో ఉన్న వారు నిద్రలోనే మృత్యువాత పడడంతో వారి బంధువులు బోరుమంటున్నారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో లారీని అక్క‌డి నుంచి తొల‌గించారు. మృతుల‌ను చెట్లకు నీళ్లు పోసే కార్మికులు బాబు రాథోడ్, కమలీ భాయ్, బ‌స‌వ‌ప్ప‌ రాథోడ్ గుర్తించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story