ఘోర ప్రమాదం.. వైర్లు తెగడంతో కిందపడిన లిఫ్ట్.. ముగ్గురు మృతి
వీటీపీఎస్‌లో లిఫ్ట్ వైర్లు తెగడంతో అమాంతం పై నుంచి కింద పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.
By తోట వంశీ కుమార్ Published on
18 March 2023 6:01 AM GMT

ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్( విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్)లో లిఫ్ట్ వైర్లు తెగడంతో.. లిఫ్ట్ అమాంతం పై నుంచి కింద పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో 8 మంది ఉన్నట్లు సమాచారం. వీరంతా లిఫ్ట్‌లో పైకి వెలుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
వీటీపీఎస్ సిబ్బంది, కార్మికులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story