విజ‌య‌న‌గ‌రం జిల్లాలో క‌ల‌క‌లం.. మహిళా ట్రైనీ ఎస్సై ఆత్మహత్య

Lady SI Bhavani commits suicide in vijayanagaram.విజయనగరం జిల్లాలో ట్రైనింగ్ ఎస్సై ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Aug 2021 12:23 PM IST
విజ‌య‌న‌గ‌రం జిల్లాలో క‌ల‌క‌లం.. మహిళా ట్రైనీ ఎస్సై ఆత్మహత్య

విజయనగరం జిల్లాలో ట్రైనింగ్ ఎస్సై ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. పోలీస్ ట్రైనింగ్ వసతి గృహంలో ట్రైనింగ్ ఎస్సై కె.భవానీ రాత్రి సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 2018 బ్యాచ్‌కు చెందిన భవానీకి.. రాజోలులో ట్రైనింగ్ అనంతరం సఖినేటిపల్లిలో పోలీస్ స్టేషన్‌లో మొదటి పోస్టింగ్ వచ్చింది. వారం రోజుల క్రితం ఎస్సై భవానీ విజయనగరానికి పీటీసీ ట్రైనింగ్‌కు వెళ్లింది. ట్రైనింగ్ పూర్తి చేసుకొని నిన్న సాయంత్రం తిరిగి సొంత జిల్లాకి వెళ్లాల్సిన భవానీ ఆత్మహత్యకు పాల్పడడంపై పలు అనుమానాలు తావిస్తున్నాయి. ఎస్సై భవానీ స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూసైడ్‌కి ప్రేమ వ్యవహారమే కారణంగా అనుమానిస్తున్న పోలీసులు... పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story