కువైట్ ట్రిపుల్ మర్డర్ కేసు.. సెంట్రల్ జైలులో కడప వాసి ఆత్మహత్య

Kuwait triple murder case: Kadapa resident commits suicide in central jail. కువైట్‌లో ట్రిపుల్‌ మర్డర్‌ కేసులో నిందితుడైన కడప వాసి వెంకటేష్‌ బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి

By అంజి
Published on : 17 March 2022 10:45 AM IST

కువైట్ ట్రిపుల్ మర్డర్ కేసు.. సెంట్రల్ జైలులో కడప వాసి ఆత్మహత్య

కువైట్‌లో ట్రిపుల్‌ మర్డర్‌ కేసులో నిందితుడైన కడప వాసి వెంకటేష్‌ బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే, ఆర్డియా ప్రాంతంలో ముగ్గురు కువైట్ కుటుంబ సభ్యులను హత్య చేసిన ఆరోపణలపై కడపకు చెందిన వెంకటేష్‌ను కొద్ది రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే వెంకటేష్ కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతుండగా.. తన భర్తను తప్పుడు కేసులో ఇరికించారని బాధితురాలి భార్య లక్కిరెడ్డిపల్లె పోలీసులను ఆశ్రయించింది.

అధికారులు, రాజకీయ నాయకుల అభ్యర్థన మేరకు ఎంబసీ అధికారులు కువైట్ అధికారులను సంప్రదిస్తున్నారు. అయితే, నిన్న సాయంత్రం కస్టడీలో ఉన్న సెంట్రల్ జైలులోని రెండు వరుసల మంచానికి గుడ్డతో వెంకటేష్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యపై విచారణ, ఫోరెన్సిక్ ఆధారాల కోసం సెంట్రల్ జైలు అధికారులు ఫోరెన్సిక్ నిపుణులకు సమాచారం అందించారు. కాగా, ఈ కేసులో వెంకటేష్ అనుమానితుడిగా ఉన్నట్లు కేసు షీట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ విషయం తెలియని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కడప లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడు కస్బాకు చెందిన వెంకటేష్‌ కువైట్‌లోని అర్డియా పట్టణంలోని సేథ్‌ అహ్మద్‌(80) వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేష్ ఓ వ్యాపారిని, అతడి భార్య కల్దా (62), కుమార్తె అసుమ (18)లను హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

Next Story