విషాదం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Krishna district accident .. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం బాపులపాడు

By సుభాష్  Published on  7 Dec 2020 8:06 AM IST
విషాదం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం బాపులపాడు మండలం బొమ్ములూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, భీమవరంలో వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారు చీమకుర్తి నాగేశ్వరరావు, తాతారావు, కనకదుర్గరావులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Next Story