బురఖా వేసుకుని మహిళల టాయిలెట్‌లోకి టెక్కీ.. వీడియోలు రికార్డ్‌ చేసి..

బురఖా ధరించి ఓ ప్రముఖ మాల్‌లోని మహిళల వాష్‌రూమ్‌లోకి ప్రవేశించి మొబైల్ ఫోన్‌లో వీడియోలు రికార్డు చేశాడు ఓ వ్యక్తి.

By అంజి  Published on  18 Aug 2023 1:30 AM GMT
Burqa, Kerala News, kochi , IT professional

బురఖా వేసుకుని మహిళల టాయిలెట్‌లోకి టెక్కీ.. .వీడియోలు రికార్డ్‌ చేసి..

బురఖా ధరించి ఓ ప్రముఖ మాల్‌లోని మహిళల వాష్‌రూమ్‌లోకి ప్రవేశించి మొబైల్ ఫోన్‌లో వీడియోలు రికార్డు చేసిన 23 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్‌ని కేరళలోని కొచ్చిలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బీటెక్‌ గ్రాడ్యుయేట్, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 (సీ) (Voyeurism), 419 (ఇంపర్సొనేషన్) కింద కేసు నమోదు చేయబడింది. నిందితుడిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66ఇ కింద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. అతని అరెస్టు తరువాత, అతన్ని స్థానిక కోర్టు ముందు హాజరుపరచగా.. నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు కలమసేరి పోలీస్ స్టేషన్ పోలీసు అధికారి తెలిపారు.

అదే నగరంలోని ఇన్ఫోపార్క్‌లోని ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్న నిందితుడు బురఖా ధరించి మహిళల వాష్‌రూమ్‌లోకి ప్రవేశించిన ఘటన కొచ్చిలోని లులు మాల్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఆపై అతను తన మొబైల్‌ను వాష్‌రూమ్‌లో చిన్న కార్డ్‌బోర్డ్ పెట్టెలో ఉంచి, విజువల్స్ రికార్డ్ చేయడానికి కెమెరా కోసం రంధ్రం చేసి, వాష్‌రూమ్ తలుపుకు అంటించాడని పోలీసులు తెలిపారు. బాక్సును ఉంచిన తర్వాత, అనుమానితుడు అక్కడి నుండి బయటకు వచ్చి వాష్‌రూమ్ ప్రధాన తలుపు ముందు నిలబడ్డాడని అధికారి తెలిపారు.

మాల్ యొక్క భద్రతా సిబ్బంది అతని కార్యకలాపాలను అనుమానాస్పదంగా గుర్తించి అతడిని పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు అధికారులు నిందితుడిని విచారించడం ప్రారంభించగా, అతను మహిళగా వేషం ధరించి తన మొబైల్ ఫోన్‌లో వాష్‌రూమ్‌లోని దృశ్యాలను రికార్డ్ చేస్తున్నాడని తేలింది. విచారణ అనంతరం బురఖా, నేరానికి ఉపయోగించిన మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నామని, అతడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అతను గతంలో ఎక్కడైనా ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడా అనే దానిపై బృందం దర్యాప్తు చేస్తోందని పోలీసు అధికారి తెలిపారు.

Next Story