దారుణం.. బాలికను కిడ్నాప్‌ చేసి 10 రోజుల నుంచి అత్యాచారం

దేశంలో నేరాలు నానాటికి పెరిగి పోతున్నాయి. ముఖ్యగా మహిళలకు రక్షణ లేకుండా పోయింది.

By Srikanth Gundamalla  Published on  31 Dec 2023 12:19 PM IST
kidnap,  rape,  minor girl,  10 days, uttar pradesh,

 దారుణం.. బాలికను కిడ్నాప్‌ చేసి 10 రోజుల నుంచి అత్యాచారం

దేశంలో నేరాలు నానాటికి పెరిగి పోతున్నాయి. ముఖ్యగా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు కొందర కామాంధులు రెచ్చిపోతున్నారు. అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. కొందరైతే వరుసలు కూడా మరిచిపోయి నమ్మినవారినే మోసం చేస్తున్నారు. ఇంకొన్ని సంఘటనల్లో వ్యక్తులు మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడి వారి ప్రాణాలనే తీస్తున్నారు. తాజాగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బదోహిలో ఓ 17 ఏళ్ల బాలిక ఇంటర్‌ చదువుతోంది. ఆమె డిసెంబర్‌ 18న కాలేజ్‌కు వెళ్లింది. ఎప్పటిలానే కూతురు కాలేజ్‌కు వెళ్లింది.. తిరిగి సాయంత్రం వరకు వచ్చేస్తుందనుకున్నారు. కానీ అలా జరగలేదు. సాయంత్రం కాస్త.. రాత్రి కావొస్తుంది. కూతురి ఆచూకీ లేదు. దాంతో.. కంగారు పడిపోయిన తల్లిదండ్రులు వెంటనే కాలేజ్‌ ప్రాంగణం వద్దకు వెళ్లారు. అక్కడ ఎలాంటి విషయం తెలియలేదు. దాంతో.. మరింత కంగారు పడిపోయారు. బాలిక స్నేహితుల ఇళ్ల వద్దకు కూడా వెళ్లి చూశారు. ఫలితం శూన్యం. దాంతో.. ఆ తల్లిదండ్రుల్లో భయం మరింత ఎక్కువైంది.

చివరకు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మరుసటి రోజు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు గాలింపు మొదలు పెట్టారు. చివరకు ఈ నెల 30న అంటే శనివారం రోజున మైనర్‌ ఆచూకీని కనుగొన్నారు పోలీసులు. ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో ఉన్నట్లు తెలుసుకుని వెళ్లారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందని పోలీసులు బాలికను ఆరా తీయగా.. ఓ వ్యక్తి తనని కిడ్నాప్ చేశాడనీ.. 10 రోజుల నుంచి అత్యాచారం చేస్తూనే ఉన్నాడని వాపోయింది. బాలిక చెప్పిన వివరాల మేరకు నిందితుడు రాజేశ్‌ దూబెను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా.. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మైనర్ బాలికను కిడ్నాప్‌ చేసి పదిరోజుల పాటు దారుణంగా రేప్‌ చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు.. స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story