ఘోరం.. కుప్ప‌కూలిన కేదార్‌నాథ్ యాత్రికుల హెలికాప్ట‌ర్‌.. ఏడుగురు మృతి

Kedarnath Helicopter Crash Two Pilots Among Seven Feared Killed.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Oct 2022 1:02 PM IST
ఘోరం.. కుప్ప‌కూలిన కేదార్‌నాథ్ యాత్రికుల హెలికాప్ట‌ర్‌.. ఏడుగురు మృతి

ఉత్త‌రాఖండ్‌లో ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. కేదార్‌నాథ్‌కు యాత్రికుల‌ను తీసుకువెలుతున్న ఓ హెలికాఫ్ట‌ర్ కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్ద‌రు ఫైల‌ట్లు, ఐదుగురు ప్ర‌యాణీకులు ఉన్నారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. హెలికాఫ్ట‌ర్ కూలిన ప్ర‌దేశంలో ద‌ట్ట‌మైన పొగ‌లు వ్యాపించాయి. హెలికాఫ్ట‌ర్ శిథాలాలు చెల్లాచెదురుగా ప‌డి ఉన్నాయి. ఫ‌టా హెలిప్యాడ్ నుంచి యాత్రికుల‌ను తీసుకువెలుతుండ‌గా కేదార్‌నాథ్ ఆల‌యానికి 2 కి.మీ దూరంలో ఉన్న గ‌రుడ్ చాటి ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌ ఉన్న విషయం తెలిసిందే. సాధారణంగా వేసవి కాలం నుంచి ఆలయం దర్శనం కోసం తెరి ఉంచుతారు. దీపావళి వరకు ఈ ఆలయంలో భక్తులకు దర్శనాలు ఉంటాయి. అయితే ట్రెక్కింగ్ చేయలేని భక్తుల కోసం.. హెలికాప్టర్‌ సేవలు అక్కడ అందుబాటులో ఉన్నాయి.

Next Story