తూర్పుగోదావ‌రి జిల్లాలో దారుణం.. మూడు సార్లు కారుతో తొక్కించి మరీ కార్పొరేట‌ర్ దారుణ హత్య

Kakinada Corporator Ramesh murder in Kakinada.తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది మూడు సార్లు కారుతో తొక్కించి మరీ కార్పొరేట‌ర్ హత్య.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Feb 2021 9:22 AM GMT
Kakinada Corporator Ramesh murder in Kakinada.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కాకినాడ 9వ డివిజ‌న్‌ ‌కార్పొరేట‌ర్ కంప‌ర ర‌మేష్ దారుణ హ‌త్య‌కి గుర‌య్యాడు. ప‌థ‌కం ప్ర‌కారం కారుతో ఢీ కొట్టి మ‌రీ హ‌త్య చేశారు. పాత కక్ష్య‌ల నేప‌థ్యంలోనే హ‌త్య జ‌రిగింద‌ని భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కార్ల మెకానిక్ షెడ్ ప్రాంతంలో గురువారం అర్థ‌రాత్రి కార్పొరేట‌ర్ ర‌మేష్‌‌, అత‌ని స్నేహితులు స‌తీష్‌, వాసులతో క‌లిసి మ‌ద్యం సేవించారు. ఆ సమయంలో.. చిన్నా అనే వ్యక్తికి రమేశ్ ఫోన్ చేసి తాము ఉన్న చోటుకి ర‌మ్మ‌న్నారు. దీంతో చిన్నా తన తమ్ముడితో కలిసి అక్కడికి వచ్చారు. అనంత‌రం తన తమ్ముడి పుట్టిన రోజు ఉంద‌ని కేక్‌ కటింగ్‌కు రావాలని ర‌మేశ్‌ను చిన్నా ఆహ్వానించారు. అయితే.. అందుకు ర‌మేష్ తిర‌స్క‌రించాడు.

అంద‌రూ ఇంటికి వెళ్తున్న స‌మ‌యంలో.. రమేష్ కార్ ఎక్కి వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేయగా కార్ తాళం కనిపించలేదు. తన కార్ తాళం చిన్నా తీసుకుకొని వెళ్లి పోయేందుకు ప్రయత్నించటం తో రమేష్, చిన్నా కార్ ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసాడు. ఈ క్రమంలోనే చిన్నా రమేష్ ని కార్ తో ఢీ కొట్టించాడు. ముందుకు వెళ్లి రివర్స్ లో వచ్చి మరో సారి గుద్దించాడు, అలా మొత్తం మీద మూడు సార్లు కారుతో తొక్కించి మరీ చిన్నాపరారయ్యాడు. ఇదంతా అక్క‌డే ఉన్న సీసీ కెమెరాలో స్ప‌ష్టంగా క‌నిపించింది. ఈ హ‌త్య వెనుక పాత కక్ష‌లూ కార‌ణ‌మై ఉంటాయ‌ని పోలీసులు భావిస్తున్నారు.

కంపర రమేష్.. తొమ్మిదో వార్డు కార్పొరేటర్. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయీ సంఘం ఛైర్మన్‌గా పనిచేశారు. ఇదివరకు ఆయన సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 1992లో ఎన్‌ఎస్‌యూఐ కాకినాడ నగర అధ్యక్షుడిగా, 1995లో తూర్పు గోదావరి జిల్లా యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షునిగా పని చేశారు. 2000లో కాకినాడ మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌గా కొనసాగారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీలో చేరారు. వైఎస్ జగన్‌ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకొన్నారు.




Next Story