కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు-ఆటో ఢీ, నలుగురు మృతి

డప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on  9 Oct 2023 6:43 AM GMT
Kadapa, Road Accident, four dead, auto,  RTC bus,

కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు-ఆటో ఢీ, నలుగురు మృతి

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం సోమవారం ఉదయం ఎర్రగుంట్ల-పొద్దుటూరు రోడ్డులో చోటుచేసుకుంది.

కడప జిల్లా ఎర్రగుంట్ల-పొద్దుటూరు రోడ్డులో ఎస్వీ కళ్యాణ మండపం వద్ద ఆర్టీసీ బస్సు-ఆటో రెండూ ఢీకొన్నాయి. ఈ రోడ్డుప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. కాగా.. మృతులు కడప జిల్లా ఆజాద్‌నగర్‌ కాలనీకి చెందిన హహ్మద్‌, హసీనా, అమీనా, షాకీర్‌గా పోలీసులు గుర్తించారు. పొద్దుటూరు నుంచి మల్లెల వెళ్తుండగా ఈ రోడ్డుప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.

పొద్దుటూరు-కడపకు చెందిన 11 మంది ఆటోలో ఎక్కారు. పొద్దుటూరు నుంచి మల్లెలకు ఆటోలో బయల్దేరింది. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీని ఆటో ఓవర్‌ టేక్‌ చేయబోయింది. అప్పుడే ఎర్రగుంట్ల నుంచి వస్తున్న బస్సు ఎదురుగా వెళ్లి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసం అయ్యింది. సంఘటనాస్థలిలో ఆటో విరిగిపోయిన పరిస్థితిని చూస్తే ప్రమాద తీవ్రత అర్థం అవుతోందని అంటున్నారు స్థానికులు. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు చనిపోయారు. మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఆటో డ్రైవర్‌ ఉన్నాడని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన చోటుకి చేరుకున్న జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, ఎర్రగుంట్ల తహశీల్దారు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నామని.. దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. ఈ ప్రమాదం గురించి మిరన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

Next Story