ప్రేమ పేరిట మోసం.. జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య
Junior Artist Suicide in film nagar.పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఇటీవల సదరు
By తోట వంశీ కుమార్ Published on 30 Sept 2021 10:38 AM ISTపెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఇటీవల సదరు యువకుడికి మరో యువతితో నిశ్చితార్థం జరిగిందని తెలుసుకుని ఆవేదన చెందిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఉంటున్న గదిలోంచి దుర్వాసన వస్తుండడంతో.. స్థానికుల సమాచారంతో పోలీసులు వెళ్లి చూడగా.. కుళ్లిన స్థితిలో జూనియర్ ఆర్టిస్ట్ మృతదేహాం కనిపించింది.
వివరాల్లోకి వెళితే.. కుత్చుల్లాపూర్ సమీపంలోని గాజుల రామారం ప్రాంతానికి చెందిన కావలి అనురాధ(22) బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని ఫిలింనగర్ జ్ఞాని జైల్ సింగ్ నగర్ బస్తీలో నివాసం ఉంటోంది. కిరణ్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గత కొద్ది నెలలుగా వారిద్దరూ అదే గదిలో నివసిస్తున్నారు. అయితే.. ఇటీవల కిరణ్‌కు మరో యువతితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం అనురాధకు ఆలస్యంగా తెలిసింది. తీవ్ర మనస్థాపానికి గురైంది. రెండు రోజుల క్రితం తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఆమె ఉంటున్న గది నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గదిలోకి వెళ్లి చూడగా.. ఫ్యానుకు చీరతో వేలాడుతూ అనురాధ మృతదేహం కనిపించింది. కిరణ్‌తో దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉందని.. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కలిసి జీవిస్తోందని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిరణ్ కోసం గాలిస్తున్నారు.