ఇటీవల సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ఓ సినిమా ఆర్టిస్ట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. సైద్ రహీమ్ అనే 24ఏళ్ల యువకుడు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఉండేవాడు. తాజాగా అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రేమ వ్యవహారం కారణమా..? లేక అవకాశాలు రాకపోవడంతోనా..? మరే ఇతర కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.