ప్రేమ పేరుతో జబర్దస్త్ ఆర్టిస్ట్ మోసం.. యువతిని లోబర్చుకుని..
ప్రేమ పేరుతో జబర్దస్త్ ఆర్టిస్ట్, సింగర్ నవ సందీప్ ఓ యువతిని మోసం చేశాడని గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
By అంజి Published on 20 Aug 2023 11:33 AM ISTప్రేమ పేరుతో జబర్దస్త్ ఆర్టిస్ట్ మోసం.. యువతిని లోబర్చుకుని..
ప్రేమించానన్నాడు.. నువ్వు లేనిదే నేను జీవించలేను అన్నాడు.. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు.. మనసిచ్చిన ప్రియుడే మనువాడుతాడని నమ్మిన ఆ యువతి సర్వం అర్పించి నిలువున మోసపోయింది. చివరకు ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జబర్దస్త్ కమెడియన్, గాయకుడు నవ సందీప్ ప్రేమ పేరుతో ఓ యువతి (28) జీవితంతో ఆడుకున్నాడు. 2018లో నవ సందీప్‌కు యువతితో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు వాట్సాప్ చాటింగ్ తో పరిచయం పెంచుకున్నారు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఈ విషయం యువతి ఇంట్లో తెలిసిపోయింది.
ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, ప్రియుడు సందీప్ తన ప్రియురాలిని తన స్వగ్రామం నుండి హైదరాబాదుకు రప్పించుకు న్నాడు. ప్రియుడి మాటలు నమ్మి హైదరాబాద్‌కు వచ్చిన యువతి షేక్పేటలోని ఆల్ హమారా కాలనీలోని ఒక హాస్టల్లో నాలుగు సంవత్సరాలుగా నివాసం ఉంటుంది. ఈ క్రమంలో నవ సందీప్ హోటల్ కి తీసుకువెళ్లి పలుమార్లు తన లైంగిక వాంఛను తీర్చుకున్నారు. పెళ్లి చేసుకుంటానని ప్రియుడు సందీప్.. యువతికి కల్లబొల్లి కబుర్లు చెప్పి పలుమార్లు యువతితో తన కోరికలు తీర్చుకున్నాడు. కళ్యాణం మాట అనేసరికి మొహం చాటేయడంతో తాను మోసపోయానని గ్రహించి బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది.
తనను ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి.. ఇప్పుడు తనను పెళ్లి చేసుకోను నువ్వు నాకు ఇష్టం లేదు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని సందీప్ చెప్తున్నాడని వాపోయింది. ప్రేమించిన ప్రియుడిని నమ్మి ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తన జీవితం అంధకారమైందని, తనకు న్యాయం చేయాలని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. గోల్కొండ పోలీసులు జీరో ఎఫైర్ నమోదు చేసి మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు కేసు బదిలీ చేశారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.