13 ఏళ్ల బాలికపై జవాన్‌ లైంగికదాడి.. గర్భవతి కావడంతో..

ITBP jawan arrested for allegedly raping Sikkim teen. ఐటీబీపీ జవాన్‌ దారుణానికి ఒడిగట్టాడు. అభం శుభం తెలియని 13 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

By అంజి  Published on  8 Aug 2022 5:58 PM IST
13 ఏళ్ల బాలికపై జవాన్‌ లైంగికదాడి.. గర్భవతి కావడంతో..

ఐటీబీపీ జవాన్‌ దారుణానికి ఒడిగట్టాడు. అభం శుభం తెలియని 13 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భవతి కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సిక్కింలోని పాక్యాంగ్‌ జిల్లా రంగ్పో పట్టణంలో చోటు చేసుకుంది. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐటీబీపీలో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న నిందితుడు సిక్కిం రాజ్‌భవన్‌లోని క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు.

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి తన కూతురిపై అతడు లైంగిక దాడికి పాల్పడుతున్నాడని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో బాలిక గర్భవతి అని, ఎస్సైతో పాటు స్థానికంగా ఉండే టీనేజర్‌ కూడా తన కూతురిని హింసిస్తున్నాడని పేర్కొంది. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలోని ధార్చుల నివాసి అయిన జవాన్‌పై పోలీసులు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ 4 (లైంగిక వేధింపులకు శిక్ష), సెక్షన్ 6 (తీవ్రమైన లైంగిక వేధింపులకు శిక్ష) కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఐటీబీపీ ఎస్‌ఐని, టీనేజర్‌ను అరెస్టు చేశారు.

బాలికను వైద్యపరీక్షల నిమిత్తం రంగ్పోలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, స్థానిక బాలుడికి, ఐటీబీపీ జవాన్‌కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Next Story