Hyderabad: జాబ్‌ ఫ్రాడ్‌ కేసులో ఈడీ దూకుడు.. వెలుగులోకి సంచలన విషయాలు

జాబ్ ఫ్రాడ్ వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

By అంజి  Published on  18 Aug 2023 4:55 AM GMT
investment fraud, dubai chinese operators, cybercrimes, Hyderabad city police

Hyderabad: జాబ్‌ ఫ్రాడ్‌ కేసులో ఈడీ దూకుడు.. వెలుగులోకి సంచలన విషయాలు

జాబ్ ఫ్రాడ్ వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడైన ప్రజాపతిపై సీసీఎస్‌లో కేసు నమోదు కావడంతో పోలీసులు ప్రజాపతిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోషల్ మీడియాలో ఉద్యోగాల పేరుతో ప్రజాపతి పలువురికి లింకులు పంపించి టాస్క్ ఇచ్చి వారి వద్ద నుండి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు. ఆ విధంగా వసూలు చేసిన డబ్బులను హవాలా రూపంలో ఉగ్రవాద సంస్థలకు నిధులు బదిలాయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. హిజ్బుల్‌ ముజాహిద్ సంస్థకు ప్రజాపతి నిధులు బదిలీ చేసినట్లుగా పోలీసులు ఆధారాలు కూడా సేకరించారు.

అయితే ఈ ప్రజాపతి దుబాయ్‌లో మకాం వేసి భారత్‌లో నిరుద్యోగుల్ని టార్గెట్‌గా చేసుకొని వారికి ఉద్యోగాల పేరుతో లింకులు పంపి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. ఈ విధంగా 720 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డ గుజరాత్‌కి చెందిన ప్రజాపతి పై ఈడి అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. చైనా కేంద్రంగా చేసుకొని పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. చిక్కడపల్లి కి చెందిన ఓ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ముఠాను పట్టుకున్నారు. బాధితుడికి టెలిగ్రామ్ యాప్ ద్వారా రేట్ అండ్ రివ్యూ పేరుతో పార్ట్ టైం జాబ్ ఆఫర్ వచ్చింది. బాధితుడు రిజిస్టర్ చేసుకున్న అనంతరం వెబ్సైట్ ద్వారా బాధితుడికి ఐదు టాస్కులు వచ్చాయి. మొదటగా కొన్ని రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. ప్రాజెక్టు రావడంతో మరల కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేశాడు. ఆన్‌లైన్‌ విండోలో చూపించిన అమౌంట్‌ని మాత్రం బాధితుడు విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేదు. అలా మొత్తం బాధితుడు 28 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు.

ఈ విధంగా బాధితుల నుండి రూ.లక్షల్లో వసూలు చేసిన డబ్బులు మొదటగా రాధిక మార్కెటింగ్ అకౌంట్‌లోకి వెళ్ళింది. ఈ రాధిక మార్కెటింగ్ అకౌంట్‌ హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ మున్వర్ మైంటైన్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం అకౌంట్లను అహ్మదాబాద్‌కు చెందిన ప్రకాశ్ ప్రజాపతి మెయింటెయిన్ చేసేవాడు. ఈ విధంగా పెద్ద మొత్తంలో వసూలు చేసిన డబ్బులు క్రిప్టో కరెన్సీకి కన్వర్ట్ చేసుకొని నగదు తీసుకుంటున్నారు. దుబాయ్, చైనాలకు నగదు వెళ్ళిపోతుంది. ఇక్కడి బ్యాంకుల్లో అకౌంట్‌లను ఓపెన్ చేసి దుబాయ్ నుండి ఆపరేట్ చేస్తున్నారు.

ఈ కేసులో ప్రధాన సూత్రదారుడు అయిన ప్రజాపతిని ట్రాప్ చేసి పోలీసులు అరెస్టు చేశారు. అతను వాడే వాట్సప్, టెలిగ్రామ్ లకు సంబంధించిన ఐపి అడ్రెస్ ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు. ఈ విధంగా మోసం చేసిన డబ్బులను దుబాయ్ అకౌంట్ లకు వెళ్ళి అక్కడి నుండి చైనావాళ్ళ అకౌంట్ లోకి వెళ్తోంది. హిజ్బుల్‌ ముజాహిద్‌ టెర్రర్ మాడ్యులర్ వాళ్ళకు ఈ నగదు లావాదేవీలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజాపతి గ్యాంగ్ ఉపయోగించిన 45 బ్యాంకు ఖాతాలను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఒకే చిరునామాతో ఈ బ్యాంకు ఖాతాలను గుర్తించారు.

Next Story