Mancherial: ఉరేసుకున్న ఇంటర్‌ విద్యార్థి.. ఎగ్జామ్‌ సరిగా రాయలేదని..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి ఇంట్లో గురువారం ఉరివేసుకుని మృతి చెందాడు.

By అంజి  Published on  16 March 2023 2:45 PM GMT
Intermediate student, Mancherial

Mancherial: ఉరేసుకున్న ఇంటర్‌ విద్యార్థి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి ఇంట్లో గురువారం ఉరివేసుకుని మృతి చెందాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా సంస్కృత భాషా పరీక్ష సరిగా రాయలేదని మనస్థాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బెల్లంపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కాల్‌టెక్స్‌ ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న రాపెల్లి శివకృష్ణ(16) పరీక్ష సరిగా రాయలేదని, కడుపునొప్పి కూడా ఉందని తల్లిదండ్రులకు ఫోన్‌లో తెలిపాడు. మంచిర్యాలకు వెళ్లిన తల్లిదండ్రులు గురువారం ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో ఉరివేసుకుని కనిపించాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక ఇలాంటి హన్మకొండ జిల్లాలో జరిగింది. నగరంలోని నక్కలగుట్టలోని కళాశాల హాస్టల్‌లో బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలు జనగాం జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామానికి చెందిన మురైశెట్టి నాగజ్యోతి. బుధవారం పరీక్షకు హాజరై తిరిగి హాస్టల్‌కు చేరుకుంది. ఇదిలా ఉండగా రాత్రి 9 గంటల సమయంలో హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో ఆమె స్నేహితులు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమెను తొలుత ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, తర్వాత ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

- ఎవరైనా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు లేదా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మీకు తెలిస్తే, దయచేసి సహాయం అందించండి. వ్యక్తులు, కుటుంబాలకు భావోద్వేగ మద్దతును అందించే ఆత్మహత్య-నివారణ సంస్థల యొక్క కొన్ని హెల్ప్‌లైన్ నంబర్‌లు ఇక్కడ ఉన్నాయి. కాల్- 9152987821, AASRA-9820466726, రోష్ని ట్రస్ట్- 040-66202000.

Next Story