పాపం జొమాటో డెలివరీ బాయ్.. అర్ధరాత్రి డెలివరీ చేయడానికి వస్తుండగా..!

Indore.. Zomato's delivery boy stabbed to death, negligence in hospital too. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని బంగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు.

By M.S.R  Published on  29 July 2022 12:45 PM GMT
పాపం జొమాటో డెలివరీ బాయ్.. అర్ధరాత్రి డెలివరీ చేయడానికి వస్తుండగా..!

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని బంగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు. ఆ యువకుడు జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అర్థరాత్రి కరోల్‌బాగ్‌లో ఆర్డర్‌ని డెలివరీ చేయడానికి వెళ్లాడు. ఆ సమయంలో దారిలో కాపుగాసిన ముగ్గురు యువకులు అతడిని ఆపి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు ఆ యువకుడు నిరాకరించడంతో దుండగులు కత్తితో పొడిచారు.

దాడి అనంతరం రక్తంతో తడిసిన సునీల్ వర్మ స్వయంగా బైక్‌పై అరవింద్ ఆసుపత్రికి చేరుకున్నాడు. అతన్ని ఆసుపత్రిలో చేర్చారు, కానీ అతని పరిస్థితి క్షీణించడం ప్రారంభించింది. ఆ తర్వాత మరో ఆసుపత్రికి రెఫర్ చేశారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్య కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మృతుడి వయస్సు 22 సంవత్సరాలు. రాజ్‌గఢ్‌లోని భగోరా గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. డెలివరీ బాయ్ హత్యపై విచారణ జరుపుతున్నట్లు అదనపు డీసీపీ రాజేష్ రఘువంశీ తెలిపారు. రాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులు చోరీకి ప్రయత్నించి.. కత్తితో పొడిచి గాయపరిచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.

Next Story