'అతను నా శరీరంతో ఆడుకుని వెళ్లిపోయాడు'.. యువతి సూసైడ్‌ నోట్‌ కలకలం

In Uttar Pradesh, a young woman committed suicide after her boyfriend cheated on her. ప్రియుడి ద్రోహానికి మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన

By అంజి  Published on  28 Sept 2022 10:37 AM IST
అతను నా శరీరంతో ఆడుకుని వెళ్లిపోయాడు.. యువతి సూసైడ్‌ నోట్‌ కలకలం

ప్రియుడి ద్రోహానికి మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో చోటుచేసుకుంది. ఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు ప్రియుడే కారణమని ఆమె ఆరోపించింది. ప్రియుడు తనను ప్రేమిస్తున్నట్లు నటించి తన శరీరంతో ఆడుకున్నాడని, ఆ తర్వాత తనను విడిచిపెట్టాడని ప్రియురాలు తన సూసైడ్ నోట్‌లో రాసింది.

ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని ప్రియురాలు సూసైడ్ నోట్‌లో కోరింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రియుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటన పిహాని కొత్వాలి పరిధిలోని రాయ్‌గై గ్రామంలో చోటుచేసుకుంది. 18 ఏళ్ల వందన తన ప్రియుడి నమ్మకద్రోహానికి విసుగు చెంది ఆత్మహత్య చేసుకుంది. వందన తన మృతికి గ్రామానికి చెందిన తన ప్రియుడు ప్రత్యూష్ అలియాస్ ఆదర్శ్ మౌర్య కారణమని ఆరోపించింది.

వందన బిల్‌గ్రామ్ తహసీల్ ప్రాంతంలోని డిగ్రీ కళాశాలలో బీఏ చదువుతున్నట్లు తెలిసింది. అదే గ్రామానికి చెందిన ప్రత్యూష్ అలియాస్ ఆదర్శ్ మౌర్య హర్దోయ్‌లో చదువుకునేవాడు. వీరిద్దరి మధ్య చాలా కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. శృంగారం అనంతరం విద్యార్థినిని ప్రియుడు విడిచిపెట్టాడు. అప్పటి నుంచి ఆమె తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ విషయంపై ఎస్పీ హర్దోయ్ దుర్గేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ 'ఓ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తల్లి నుంచి ఫిర్యాదు అందింది. మృతురాలు ప్రత్యూష్‌తో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోందని, ఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

Next Story