Hyderabad: భవనం పైనుంచి దూకి సాఫ్ట్‌వేర్ మహిళ ఆత్మహత్య
హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 27 Sept 2024 6:20 PM ISTహైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మయూరి నగర్ లో 9వ అంతస్తుపై నుండి దూకి ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. మహిళ తన భర్తతో విభేదాలు రావడంతో ఆత్మహత్య చేసుకుందని తెలిసిందేఇ.
మియాపూర్ పరిధిలో సింధూర (29) అనే మహిళ దివ్యశక్తి అపార్ట్‌మెంట్‌లో భర్త బాబుతో కలిసి నివాసం ఉంటోంది. ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. అయితే.. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పాటు .. భర్తతో విబేధాలు ఉన్నాయి. దాంతో.. సింధూర డిప్రెషన్‌కు గురైంది. శుక్రవారం ఆమె తాను ఉంటోన్న అపార్ట్‌మెంట్ 9వ అంతస్తు పైనుంచి దూకింది. కిందపడిపోయిన ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తం అక్కడే ఎక్కువగా పోవడంతో స్పాట్‌లోనే చనిపోయింది.
ఇక ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. మృతురాలి తండ్రి మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన కంప్లైంట్‌తో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.