Hyderabad: ఓయో రూమ్‌లో డైరెక్టర్ ఆత్మహత్య
హైదరాబాద్‌లో ఓ చిన్న సినిమా దర్శకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 6 Aug 2024 12:30 PM ISTHyderabad: ఓయో రూమ్‌లో డైరెక్టర్ ఆత్మహత్య
హైదరాబాద్‌లో ఓ చిన్న సినిమా దర్శకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓయో రూమ్ బుక్ చేసుకున్న ఆ డైరెక్టర్.. లాడ్జి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక హోటల్ సిబ్బంది సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు చేస్తున్నట్లు కూకట్‌పల్లి పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన కొమారి జానయ్యా అలియాస్ కొమారి జానకిరాం ఆదివారం సాయంత్రం కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీకి వచ్చాడు. శ్రీ ఆనంద్ఇన్ ఓయో లాడ్జిలో రూమ్ తీసుకుని అక్కడే బస చేశాడు. అతను ఒక్కరోజుకే డబ్బులు కట్టడంతో.. సోమవారం లాడ్జి గది చెక్ అవుట్ చేయాల్సి ఉంది. కానీ.. అతను ఇంతకు లాడ్డీ రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది రూమ్ డోర్‌ను కొట్టారు. లోపల గడియ పెట్టి ఉన్నా అతను స్పందించలేదు. దాంతో.. అనుమానం వచ్చిన సిబ్బంది రూమ్ కిటికీలను తెరిచి చూశాడు. జాణయ్య ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు.దాంతో.. వెంటనే లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న కూకట్‌పల్లి పోలీసులు గదిని తెలిరిచి మృత దేహాన్ని కిందికి దించారు. అతనితో పాటు ఒక బ్యాగ్ ఉందనివెల్లడించారు. పోలీసులు. దానిలో వివరాలను బట్టే చనిపోయిన వ్యక్తి వివరాలను తెలిపారు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు గతంలో GST(God Saithan Technology) అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో, సొంత బ్యానర్ పై నిర్మించినట్లు పోలీసులు వెల్లడించారు. అతను ఓయో రూమ్ కు ఎందుకు వచ్చాడు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ విషయాన్ని బకుటుంబ సభ్యులకు కూడా తెలిపారు.