Hyderabad: పాతబస్తీలో స్టెరాయిడ్ ఇంజెక్షన్ల కలకలం.. ఇద్దరు అరెస్ట్

నగరంలోని పాతబస్తీలో అక్రమంగా నిషేధిత స్టెరాయిడ్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్...

By -  అంజి
Published on : 23 March 2026 10:50 AM IST

Hyderabad Drug Bust, Charminar Zone Task Force, Chaderghat Steroid Racket, Mephentermine Injections Seized, Old City Hyderabad Crime, Banned Steroids Supply Delhi to Hyderabad

Hyderabad: పాతబస్తీలో స్టెరాయిడ్ ఇంజెక్షన్ల కలకలం.. ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో అక్రమంగా నిషేధిత స్టెరాయిడ్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ (చార్మినార్ జోన్) పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. చాదర్‌ఘాట్ పరిధిలో జరిగిన ఈ దాడిలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి భారీగా ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు ఓల్డ్ మలక్‌పేట నివాసితులైన షేక్ సమీర్, వసీం ఖాన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు కొంతకాలంగా నగరంలో యువతను లక్ష్యంగా చేసుకుని 'మెఫెంటెర్మైన్' (Mephentermine) అనే నిషేధిత స్టెరాయిడ్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.

ఈ దాడిలో నిందితుల వద్ద నుంచి 20 నిషేధిత స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, 3 మొబైల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో నిందితులు ఈ నిషేధిత డ్రగ్స్‌ను ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీసుల ద్వారా తెప్పిస్తున్నట్లు వెల్లడైంది. అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి, హైదరాబాద్‌లోని జిమ్ బాడీ బిల్డర్లు, యువతకు భారీ ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న మొత్తం నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ సరఫరా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు? ఇంకా ఎవరెవరికి ఈ ఇంజెక్షన్లు అమ్ముతున్నారు? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story