Hyderabad: ఆటోలో ఎక్కిన మహిళను ఎత్తుకెళ్లి అత్యాచారం
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్తపై ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్‌కు బయల్దేరిన మహిళ అత్యాచారానికి గురైంది.
By Srikanth Gundamalla Published on 15 July 2024 1:30 PM ISTHyderabad: ఆటోలో ఎక్కిన మహిళను ఎత్తుకెళ్లి అత్యాచారం
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్తపై ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్‌కు బయల్దేరిన మహిళ అత్యాచారానికి గురైంది. ఆటో డ్రైవర్ సాయంతో ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని అల్వాస్ పీఎస్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాప్రాల్‌కు చెందిన ఓ మహిళ తన భర్తపై గొడవ కారణంగా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఈ నెల 12న సాయంత్రం ఆల్వాల్ పీఎస్‌కు బయల్దేరింది.ఈ క్రమంలోనే ఆటోను ఉబెర్‌లో బుక్ చేసుకుంది. AP11 TA 0266 నెంబర్ ప్లేట్‌తో ఉన్న ఆటో రాగానే అందులో పీఎస్‌కు వెళ్లి భర్తపై కంప్లైంట్ చేసింది. అయితే.. అప్పుడే సదురు మహిళపై ఆటో డ్రైవర్ కన్నేశాడు. పీఎస్ దగ్గరే ఉండిపోయాడు.. రిటర్న్‌లో మళ్లీ యాప్రాల్‌లో దించుతానని నమ్మించాడు. ఆటోలో ఎక్కించుకుని రూట్ మార్చి గల్లీ గల్లీ తిప్పాడు. వైన్ షాపు వద్ద ఇద్దరు వ్యక్తులకు ఆమెను అప్పగించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఇద్దరు వ్యక్తులు ఆమెను కారులో బలవంతంగా ఎక్కించుకుని బెదిరించారు. ఆమెపై అత్యాచారం కారులోనే చేశారు. శనివారం తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో వారి నుంచి తప్పించుకున్న మహిళ గణేశ్ ఆలయం వద్దకు వచ్చింది. స్థానికుల సాయంతో డయల్ 100 కు కాల్ చేసింది. పోలీసులకు కంప్లైంట్ చేసింది. బొల్లారం పోలీసులు అక్కడికి చేరుకుని జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత అల్వాల్ పీఎస్‌కు బదిలీ చేశారు. దర్యాప్తులో భాగంగా ఆటో డ్రైవర్ శంకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.