ప్రేమ పేరుతో వైద్యురాలిని మోసం చేసిన నిమ్స్ డాక్టర్
ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్న ఘటనలు రోజూ పెరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 24 Aug 2023 7:27 PM ISTప్రేమ పేరుతో వైద్యురాలిని మోసం చేసిన నిమ్స్ డాక్టర్
ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్న ఘటనలు రోజూ పెరుగుతున్నాయి. ప్రేమిస్తున్నాను.. కలిసి ఉందాం.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మహిళలను మోసాలు చేస్తున్నారు కేటుగాళ్లు. కొన్నిసార్లు అయితే.. మహిళలు కూడా మోసాలకు పాల్పడ్డ ఘటనలూ కలకలం రేపాయి. అయితే.. తాజాగా బాగా చదువుకున్న ఓ డాక్టర్ కూడా తప్పుదారిలో నడిచాడు. తొటి వైద్యురాలిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడు.
కేరళకు చెందిన 34 ఏళ్ల వైద్యురాలు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో క్లినికల్ విభాగంలో సీనియర్ రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. అయితే.. కొద్దిరోజులకే గ్యాస్ట్రో సర్జరీ విభాగంలో డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సౌరవ్ చౌదరితో ఆమెకు పరిచయం ఏర్పడింది. 2020లో వీరిద్దరూ కలవగా.. స్నేహం ఏర్పడింది. తర్వాత రోజూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు... స్నేహం కాస్త ప్రేమగా మారింది. సదురు డాక్టర్ సౌరవ్ చౌదరి.. పెళ్లి చేసుకుంటానని వైద్యురాలిని నమ్మించాడు. కొంతకాలం ఇద్దరూ సహజీవనం చేశాడు. మహిళా డాక్టర్ కూడా అతడి మాటలు నమ్మి సౌరవ్ చెప్పినవన్నీ చేసింది. చివరకు సౌరవ్ మహిళా డాక్టర్‌ను మోసం చేసి.. కోల్‌కతా వెళ్లిపోయాడు.
పెళ్లి చేసుకోవాలని కోరగా సౌరవ్ నిరాకరించాడు. దాంతో మోసం చేశాడని గ్రహించిన బాధితురాలు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పంజాగుట్ట పోలీసులు ప్రకటించారు.