Hyderabad: ఫ్లాట్‌లో మహిళ దారుణ హత్య

వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

By Srikanth Gundamalla  Published on  30 Sept 2024 9:00 PM IST
Hyderabad: ఫ్లాట్‌లో మహిళ దారుణ హత్య

సీబీఆర్ ఎస్టేట్ లో వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్పందన (29) అనే వ్యక్తి ఐసిఐసిఐ బ్యాంక్ లో పని చేస్తుంది. భర్త వినయ్ కుమార్ స్నేహ చికెన్ సెంటర్ లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. వీరికి 2022 లో వివాహం అయ్యింది.

అయితే వీరి సంసారం సాఫీగా సాగింది. కానీ.. గత కొద్ది నెలల నుండి దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. అలా ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. స్పందన సీబీఆర్ ఎస్టేట్ ఫ్లాట్‌లో నివాసం ఉంటోంది. అయితే తల్లితో పాటు కుటుంబ సభ్యులు పక్కపక్కనే ఉండడంతో ఇంటికి తాళం వేసి అక్కడే ఒక చోట పెడుతూ ఉంటారు. రాత్రి కూడా ఆమె పడుకొని ఉండగా కుటుంబ సభ్యుల్లో ఒకరు బయట నుంచి తాళం వేసి వెళ్ళారు. సోమవారం ఉదయం ఆమె తల్లి వచ్చి చూడగా ఆమె దారుణ హత్యకు గురై రక్తం మడుగులో పడి ఉంది. అది చూసిన ఆమె తల్లి ఒక్కసారిగా షాక్ కు గురైంది.

అయితే తెల్లవారు జామున తాళం వేసి వున్న ఇంటిలోకి ఓ అగంతకుడు వచ్చి హత్యచేసినట్టు కుటుంబీకులు అంటున్నారు. దంపతుల మధ్య గొడవలు జరగడంతో వారిద్దరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రస్తుతం కోర్ట్ లో విడాకుల కేసు నడుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. సీసీ కెమెరా ఆధారంగా మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని మియాపూర్ పోలీసులు తెలిపారు. పూర్తి విచారణ తర్వాత వివరాలు తెలుపుతామని సీఐ తెలిపారు.

Next Story