Hyderabad: మణికొండలో కారులో మృతదేహం కలకలం
హైదరాబాద్‌లోని మణికొండలో ఆగిఉన్న కారులో మృతదేహం కనిపించిన సంఘటన కలకలం రేపుతోంది.
By Srikanth Gundamalla
Hyderabad: మణికొండలో కారులో మృతదేహం కలకలం
హైదరాబాద్‌లోని మణికొండలో ఆగిఉన్న కారులో మృతదేహం కనిపించిన సంఘటన కలకలం రేపుతోంది. మణికొండలో మారుతికారు ఆగి ఉండటాన్ని గమనించారు స్థానికులు. అయితే.. ఆ కారు ఎంతకీ ఎవరూ తీయకపోవడంతో అనుమానం వచ్చి లోపల చూశారు. అందులో ఓ వ్యక్తి అచేతనంగా పడి ఉండటాన్ని చూశారు. దాంతో.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇక సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారు డోర్లు ఓపెన్ చేశారు. కారు లోపల ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. మృతదేహం కారు వెనుక సీట్లో ఉండటంతో.. ఎవరైనా చంపారా? లేదంటే సాధారణ మరణమేనా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. సదురు వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అని అన్ని విషయాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారు నెంబర్ ఆధారంగా వివరాలను సేకరించామని చెప్పారు. అంతేకాదు.. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగారు. ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. కారులో ఉన్నట్లుండి శవం లభ్యం కావడంతో స్థానికంఆ ఉన్నవారంతా ఆందోళనకు గురవుతున్నారు.