Hyderabad: మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన.. వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష

హైదరాబాద్ నగరంలోని ఉప్పుగూడలో మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి నాంపల్లి 12వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్

By అంజి  Published on  21 April 2023 7:44 AM IST
imprisonment, Minor Girl ,POCSO Act, Police

Hyderabad: మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన.. వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష

హైదరాబాద్ నగరంలోని ఉప్పుగూడలో మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి నాంపల్లి 12వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్ కోర్టు గురువారం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. మైనర్ బాలిక తల్లిదండ్రులు లేని సమయంలో రైల్వేలో స్వీపర్‌గా పనిచేస్తున్న నేనావత్ వంశీకృష్ణ అలియాస్ రాము (38).. ఇంటికి వెళ్లి బాలికపై దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో అతడు పారిపోయాడు. ఇంటికి వచ్చిన తర్వాత బాధితురాలు విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. ఈ ఘటన జులై 27, 2023న జరిగింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఛత్రినాక పోలీసులు ఐపీసీ, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జులై 28, 2022న రాముని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత పోలీసులు కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం ఆ వ్యక్తికి కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

Next Story