Hyderabad: కోచింగ్ సెంటర్‌లో యువతి ఆత్మహత్య
హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 10 Aug 2024 9:00 PM ISTHyderabad: కోచింగ్ సెంటర్‌లో యువతి ఆత్మహత్య
హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తాను ఉంటోన్న కోచింగ్ సెంటర్‌లోనే ఆత్మహత్యకు పాల్పడం కలకలం రేపింది. మృతురాలు ఒడిశా రాష్ట్రంలోని బలేశ్వర్ జిల్లా సమిలీ లియా గ్రామానికి చెందిన గీతాంజలి (23)గా పోలీసులు తెలిపారు.
ఈ యువతి జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చిందని పోలీసులు చెప్పారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మయూరి నగర్‌లో ఉన్న కోరుకొండ కోచింగ్ సెంటర్‌లో పని ఏస్తోంది. గత మూడేళ్లుగా ఇక్కడే పని చేస్తూ జీవనాన్ని సాగిస్తోంది. అయితే.. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఆమె పని చేస్తున్న కోరుకొండ సైనిక్ కోచింగ్ సెంటర్‌లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని కిందకు దించి పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే మృతురాలు బంధువులు మాత్రం గీతాంజలిని లైంగికదాడి చేసి అనంతరం ఫ్యాన్ కు ఉరివేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. గీతాంజలి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె బంధువులు కోరుకొండ కోచింగ్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు.