లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన GHMC ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్

లంచం తీసుకుంటుండగా జీహెచ్ఎంసీ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  11 March 2024 5:30 PM IST
hyderabad, ghmc, tax inspector, bribe,  acb raids,

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన GHMC ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ 

ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పని ఉందంటే చాలు.. ప్రజలు అబ్బా లంచం ఇవ్వనిదే పని జరగదనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. ఇప్పటికే చాలా మంది అవినీతి అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వారు జైల్లో కూర్చున్నారు. అయినా కూడా ఇంకా కొందరు అవినీతి అధికారుల్లో అస్సలు మార్పు రావడం లేదు. నన్నెవరు పట్టుకుంటారు లే అన్న దీమాతో యథేచ్చగా లంచం తీసుకుంటున్నారు. అయితే.. తాజాగా హైదరాబాద్‌లో ఓ అవినీతి అధికారి ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కాడు.

లంచం తీసుకుంటుండగా జీహెచ్ఎంసీ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫ్లాట్‌కు ఓనర్‌ షిప్‌ సర్టిఫికెట్‌ ఇచ్చే విషయంలో సదురు ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ లంచం డిమాండ్ చేశాడు. రాధాకృష్ణ అనే జీహెచ్‌ఎంసీ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్‌.. ఫ్లాట్‌ ఓనర్‌షిప్‌ సర్టిఫికెట్‌ కోసం వచ్చిన వ్యక్తి నుంచి రూ.8వేలు లంచం డిమాండ్ చేశాడు. లంచం డిమాండ్‌ చేయడంతో అతను ఇది తప్పు అన్నట్లుగా ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌కు చెప్పాడు. కానీ..అతను వినలేదు. లంచం ఇస్తేనే పని అవుతుందని చెప్పడంతో.. సదురు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు నడుచుకున్నాడు. అధికారులు చెప్పిన విధంగానే సోమవారం అడిగిన డబ్బులు ఇస్తానంటూ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌కు చెప్పాడు. ఇక అధికారి రాధాకృష్ణ డబ్బులు తీసుకుంటుండగా రైడ్‌ చేసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలను చెబుతామన్నారు.

Next Story