Hyderabad: సినిమాలో చాన్స్ పేరుతో సాఫ్ట్‌వేర్ యువతిపై అత్యాచారం

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  1 Aug 2024 8:10 AM IST
hyderabad,  assistant director, rape,  software lady  ,

Hyderabad: సినిమాలో చాన్స్ పేరుతో సాఫ్ట్‌వేర్ యువతిపై అత్యాచారం

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అసిస్టెంట్ డైరెక్టర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధిత యువతి పుప్పాలగూడలోని ఓ కంపెనీలో పనిచేస్తోంది. మాయ మాటలు చెప్పి నమ్మించి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేగింది.

గచ్చిబౌలి లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పై అసిస్టెంట్ డైరెక్టర్ సిద్ధార్థ్‌ వర్మ అత్యాచారానికి పాల్పడ్డాడు. విశాఖపట్నంకుచెందిన సిద్దార్థ్ వర్మ(30) అనే వ్యక్తి కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నాడు. సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. పుప్పలగూడలోనీ ఐటి కారిడార్‌లో ఉన్న ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న అనంతపురంకు చెందిన యువతిపై సిద్ధార్థ కన్నుపడింది. ఆ యువతిని ఎలాగైనా తన మాయ మాటలతో లొంగ తీసుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ్ వర్మ తెలిసిన యువతి ద్వారా సాఫ్ట్‌వేర్ యువతిని పరిచయం చేసుకున్నాడు. మీరు చాలా అందంగా ఉన్నారని సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి కల్లబొల్లి కబుర్లు చెప్పి నమ్మించాడు. ఆ యువతితో బాగా పరిచయం పెంచుకున్నాడు. ఓ రోజు యువతిని డిన్నర్ పేరిట తను ఉంటున్న ఇంటికి రమ్మని సిద్దార్థ్ వర్మ పిలిచాడు. సినిమాలో ఛాన్స్ గురించి ఇద్దరు మాట్లాడుకుందామని ఇంటికి రమ్మని పిలవడంతో అది నిజమని నమ్మిన యువతి సిద్దార్థ్ ఇంటికి వెళ్ళింది.

ఇక ఇంటికి వెళ్లిన యువతికి సిద్ధార్థ వర్మ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అది తాగిన యువతి స్పృహ తప్పి పడిపోయింది. అనంతరం సిద్దార్థ్ వర్మ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు సిద్దార్థ్ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. యువతి సిద్దార్థ్ వర్మపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు సిద్దార్థ్ వర్మను అరెస్ట్ చేశారు. రిమాండ్‌కు తరలించారు.

Next Story