Hyderabad: లిఫ్టులో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్ పరిధిలోని ఎల్‌బీనగర్ ఆర్టీసీ కాలనీలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 7 Nov 2023 4:45 PM ISTHyderabad: లిఫ్టులో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్ పరిధిలోని ఎల్‌బీనగర్ ఆర్టీసీ కాలనీలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. లిఫ్టులో ఇరుక్కొని ఓ చిన్నారి బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో నూతన భవన నిర్మాణం జరుగుతుంది. అయితే గత 20 రోజుల క్రితం నుంచి నాగరాజు, అనురాధ అనే దంపతులు వాచ్‌మెన్‌గా ఇక్కడ పనికిగి దిగారు. అప్పటి నుంచి అతను అక్కడే వాచ్‌మెన్‌గా పనిచేస్తూ వస్తున్నాడు. వీరికి అక్షయ్ కుమార్ (4) అనే కుమారుడు ఉన్నాడు. అక్షయ్ కుమార్ లిఫ్ట్ ఎక్కిన కొద్దీ సేపటికే లిఫ్ట్ ఆగిపోయింది. దాంతో బాలుడు దాంట్లనే ఇరుక్కుపోయాడు. ఎంతసేపటికీ అదీ పనిచేయలేదు. దాంతో.. అక్షయ్ కుమార్ గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. బాలుడి అరుపులు విన్న తల్లిదండ్రులు, అక్కడే ఉన్న కొందరు స్థానికులు లిఫ్ట్ పనిచేయకపోవడాన్ని గమనించారు. బాలుడు అందులో ఉన్నాడని తెలుసుకుని వెంటనే దాన్ని తెరిచే ప్రయత్నాలు చేశారు.
ఎట్టకేలకు అక్కడ పనిచేస్తున్న కార్మికుల సాయంతో లిఫ్ట్ తెరిచి కూడగా బాలుడు స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. దాంతో.. బాలుడి తల్లిదండ్రులు వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అక్షయ్ కుమార్ చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే కన్నుమూశాడు. అక్షయ్ కుమార్ మృతి చెందడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. పోలీసులు, బిల్డింగ్ ఓనర్ తమ కొడుకు మృతదేహాన్ని తమకు చూపించకుండా పోస్టుమార్టానికి తరలించారని తల్లిదండ్రులు ఆరోపణ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు కొడుకు శవాన్ని చూపించకుండా డెడ్ బాడీ నీ పోస్టుమార్టం నిమిత్తం ఎలా తరలిస్తారు అంటూ బంధువులు ఆందోళనకు దిగారు. దాంతో.. ఆస్పత్రి వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.