ఆసిఫ్ నగర్ మర్డర్ కేసు.. ఐదుగురు అరెస్ట్
ఆసిఫ్‌నగర్ రోడ్‌లో ఒక వ్యక్తిని హత్య చేసినందుకు ఐదుగురు వ్యక్తులను ఆసిఫ్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By M.S.R Published on 15 Jun 2024 3:30 PM GMTఆసిఫ్ నగర్ మర్డర్ కేసు.. ఐదుగురు అరెస్ట్
జూన్ 13, గురువారం ఆసిఫ్‌నగర్ రోడ్‌లో ఒక వ్యక్తిని ప్రజలందరూ చూస్తూ ఉండగానే హత్య చేసినందుకు ఐదుగురు వ్యక్తులను ఆసిఫ్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల సోదరుల్లో ఒకరిని హత్య చేసినందుకు ప్రతీకారంగా ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య జరుగుతున్నప్పుడు ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. మొబైల్ ఫోన్‌ల తో ఈ హత్యను పలువురు రికార్డు చేశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
పట్టుబడిన వారిలో సయ్యద్ తాహెర్, 27, సయ్యద్ ఇమ్రాన్, 24, సయ్యద్ ముజఫర్ ఉన్నారు వీరు ముగ్గురు సోదరులు. వారికి బంధువులైన సయ్యద్ అమన్, షేక్ జావీద్ లు కూడా సహాయం అందించారు. 2023లో ఆసిఫ్‌నగర్‌లోని ఓ బార్ సమీపంలో తాహెర్, ఇమ్రాన్, ముజాఫర్‌ల సోదరుడైన ముజాహెద్‌ను మృతుడు మహ్మద్ కుతుబుద్దీన్ హత్య చేసినట్లు సౌత్ వెస్ట్ ఇన్‌ఛార్జ్ డీసీపీ స్నేహ మెహ్రా తెలిపారు. హత్యానంతరం కుతుబుద్దీన్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ హత్యకు తాహెర్, అతని సోదరులు హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు. ఇతర బంధువుల సహాయంతో హత్యను ప్లాన్ చేశారు. గురువారం రాత్రి రహదారిపై కుతుబుద్దీన్‌ను వెంబడించి, కర్రలతో దాడి చేసి, కత్తులతో పొడిచారు. గాయపడిన కుతుబుద్దీన్ అక్కడి నుంచి తప్పించుకుని తన అన్న రహీం షాపు వద్దకు చేరుకున్నాడు. కుతుబుద్దీన్ ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. హత్య తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి తాహెర్, ఇమ్రాన్, ముజాఫర్, అర్మాన్, జావీద్‌లను అరెస్ట్ చేశారు.