భార్యను హత్య చేసి.. శవం పక్కనే కూర్చుని వీడియో గేమ్ ఆడుతూ..
Husband murdered Wife I భార్యను హత్య చేసి.. శవం పక్కనే కూర్చుని వీడియో గేమ్ ఆడుతూ..
By సుభాష్ Published on 8 Dec 2020 3:16 PM ISTరాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో కోపోద్రిక్తుడైన భర్త.. భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహం పక్కనే కూర్చొని వీడియో గేమ్ ఆడుతూ కనిపించిన దృశ్యం పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. .
జోధ్ పూర్ లోని బీజేఎస్ కాలనీకి చెందిన విక్రమ్ సింగ్(35), శివ్ కన్వర్ (30) భార్యా భర్తలు. వీరికి ఇద్దరు సంతానం. విక్రమ్ ఏ పని చేయకుండా జులాయిగా తిరిగేవాడు. శివ కన్వర్ మిషన్ కుట్టుతూ.. వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేంది. ఏ పని చేయకపోగా.. ఇంట్లోనే ఉంటూ నిత్యం భార్యతో గొడపడేవాడు విక్రమ్. సోమవారం కూడా మరోసారి వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కోపోద్రికుడైన విక్రమ్ తన భార్యపై కత్తెరతో పొడిచి దాడికి పాల్పడ్డాడు. రక్తపు మడుగులో పడి విల విల కొట్టుకుంటున్న భార్యను పట్టించుకోలేదు. అలా ఆమె తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయింది.
అనంతరం అత్తమామలకు ఫోన్ చేసి మీ కూతుర్ని చంపేశాను అని చెప్పారు. వారి వచ్చి చూడగా.. కూతురు రక్తపు మడుగులో పడి ఉంది. అల్లుడి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మాటలను అతడు పట్టించుకోలేదు సరికదా.. గేమ్ ఆడడం ఆపనూ లేదు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వచ్చే సమయానికి కూడా విక్రమ్ సింగ్ ఫోన్ లో వీడియో గేమ్ ఆడుతూనే కూర్చున్నాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని.. బాధితురాలిని ఆస్ప్రతికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.