భార్యను చంపి.. ఆమె చెల్లెలితో పారిపోయిన భర్త

Husband escapes with sister-in-law after killing wife.బీహార్‌లోని బాద్ జిల్లాలో మానవ సంబంధాలకు ఏ మాత్రం విలువ

By M.S.R  Published on  16 Nov 2021 10:30 AM GMT
భార్యను చంపి.. ఆమె చెల్లెలితో పారిపోయిన భర్త

బీహార్‌లోని బాద్ జిల్లాలో మానవ సంబంధాలకు ఏ మాత్రం విలువ ఇవ్వని ఓ ఘటన చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను హత్య చేసి భార్య తో కలిసి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మొకామా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తును చేపట్టారు.

చనిపోయిన మహిళను 24 ఏళ్ల వర్ష కుమారిగా గుర్తించారు. పారిపోయిన ఆమె భర్తను షాని పాశ్వాన్‌గా గుర్తించారు. పోలీసు అధికారి రాజానందన్ శర్మ మాట్లాడుతూ వర్ష కుమారిని చంపేసి.. ఓ పెట్టెలో పెట్టి తాళం వేశారని రెలిపారు. "తాళం వేసి ఉన్న పెట్టెలో నుండి మృతదేహాన్ని మేము బయటకు తీశాం. ఇది హత్య అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతురాలి భర్త షానీ పాశ్వాన్ పరారీలో ఉన్నట్లు తేలింది" అని అన్నారు.

షానీ పాశ్వాన్ తన భార్యను హత్య చేసిన తర్వాత ఆమె చెల్లితో కలిసి పారిపోయాడని స్థానికులు పోలీసులతో తెలిపారు. 4 సంవత్సరాల క్రితం వర్ష కుమారికి షాని పాశ్వాన్‌తో వివాహం జరిగింది. అయితే షానీ పాశ్వాన్ తన భార్య వర్ష సోదరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో భార్యను హత్య చేసి.. తన మరదలితో కలిసి పరారయ్యాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story
Share it