కరోనా వైరస్ మానవ జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా కుటుంబ పెద్దలు మరణిస్తుండగా.. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతోన్నాయి. కరోనా కారణంగా భర్త చనిపోవడంతో.. భార్య తీవ్రమనస్థాపానికి గురైంది. భర్త లేని లోకంలో తాను ఉండలేనని మూడేళ్ల కుమారుడిని తీసుకుని చెరువు వద్దకు వెళ్లింది. కుమారుడిని చెరువు గట్టుపై కూర్చోపెట్టి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అమ్మ ఏం చేసిందో అర్థం చేసుకోలేని ఆ చిన్నారి.. అమ్మ నీళ్లలోకి వెళ్లిందని.. తాను కూడా నడుచుకుంటూ నీటిలోకి వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలోని నాందేద్ జిల్లాలో చోటు చేసుకుంది.
తెలంగాణకు చెందిన ఓ కుటుంబ బ్రతుకుదెరువు కోసం మహారాష్ట్రకు వలస వెళ్ళింది. మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణంలో అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులు చేస్తూ గడుపుతున్నారు. ఇటీవల ఆ ఇంటి పెద్ద కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. భర్త చనిపోడంతో అతడి భార్య తీవ్ర మనస్తాపానికి గురైంది. తన మూడేళ్ళ కొడుకు తీసుకోని సమీపంలోని చెరువు వద్దకు వెళ్ళింది. బాబును ఒడ్డుపై నిల్చోబెట్టి ఆమె చెరువులో దూకింది. తల్లి ఎం చేసిందనేది అర్థం చేసుకోని ఆ చిన్నారి.. ఎంతసేపటికి తల్లి బయటకు రాకపోవడంతో అమ్మ కోసం ఏడుస్తూ.. చెరువులోకి నడుచుకుంటూ వెళ్లాడు.
సమీపంలో ఉన్న ఓ వ్యక్తి బాలుడుని గమనించి పరుగుపరుగున చెరువు దగ్గరకు వచ్చాడు. కానీ అప్పటికే ఆ బాలుడు నీటిలో పడి మృతి చెందాడు. దీంతో ఆ వ్యక్తి సమీపంలో ఉన్న కొందరిని తీసుకోని చెరువు వద్దకు వచ్చి బాలుడి మృతదేహం కోసం గాలిస్తుండగా అతడి తల్లి మృతదేహం కూడా లభ్యమయింది.