భార్య చేసిన ప‌నికి నాలుక కోసుకున్న భ‌ర్త‌.. ఏం జ‌రిగిందంటే..?

Husband cut his tongue.భార్యతో వాదించ‌డం ఇక వ్య‌ర్థం అని బావించిన‌ ఓ భ‌ర్త నాలుక కోసేసుకున్నాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 March 2021 4:27 AM GMT
Husband cut his tongue

భార్యా భ‌ర్త‌లు అన్నాక వారి మ‌ధ్య చిన్న చిన్న‌ గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం సాధ‌ర‌ణ విష‌య‌మే. అయితే.. ఓ భార్య త‌ర‌చూ భ‌ర్త‌తో గొడ‌వ‌కు దిగేది. ఈ క్ర‌మంలో భార్యతో వాదించ‌డం ఇక వ్య‌ర్థం అని బావించిన‌ ఓ భ‌ర్త నాలుక కోసేసుకున్నాడు. ఈ బాధాక‌రమైన ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే.. కాన్పూర్ జిల్లా గోపాల్ పూర్ లో ముఖేశ్, నిషా దంపతులు నివ‌సిస్తున్నారు. వ్య‌వ‌సాయ‌మే వీరికి జీవ‌నాధారం. అయితే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఇటీవల కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో అగిలిన నిషా పుట్టింటికి వెళ్లింది.

భార్య‌కు న‌చ్చ‌జెప్పిన ముఖేశ్ మ‌ళ్లీ కాపురానికి తీసుకువ‌చ్చారు. మ‌ళ్లీ ఆనంద‌గా ఉందామ‌ని కోరాడు. అయితే.. నిషా మ‌ళ్లీ అత‌డితో గొడ‌వ‌కు దిగింది. ఇద్ద‌రి మ‌ధ్య మాటా మాటా పెరిగిపోయింది. ఆవేశంలో ముఖేష్.. నిషాతో వాదించ‌డం వేస్ట్ అని బావించాడు. వెంట‌నే బ్లేడ్‌తో నాలుక కోసేసుకున్నాడు. తీవ్ర ర‌క్త‌స్త్రావం కావ‌డంతో ముఖేశ్‌ను కుటుంబ స‌భ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే ముఖేష్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు కాన్పూర్‌లోని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.
Next Story
Share it