భార్య‌ను కిరాత‌కంగా హ‌త్య‌చేసి.. మృత‌దేహంతో సెల్ఫీ తీసుకొని..

Husband brutally murdered his wife.క‌ట్టుకున్న భార్య‌ను అతికిరాత‌కంగా హ‌త్య చేశాడు. అనంత‌రం తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు నాట‌క‌మాడాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 May 2021 1:36 PM IST
Husband brutally murdered his wife

క‌ట్టుకున్న భార్య‌ను అతికిరాత‌కంగా హ‌త్య చేశాడు. అనంత‌రం తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు నాట‌క‌మాడాడు. అంద‌రిని న‌మ్మించ‌డం కోసం చ‌నిపోయిన భార్య‌తో సెల్పీ తీసుకుని బంధువుల‌కు పంపించాడు. ఈ ఘ‌ట‌న వైఎస్ఆర్ జిల్లా బ‌ద్వేలు ప‌ట్ట‌ణలో జ‌రిగింది. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. జ‌మ్మ‌ల‌మ‌డుగు ప‌ట్ట‌ణంలో వెంక‌టేశ్వ‌ర‌కాల‌నీకి చెందిన మంజుల‌(23) వివాహాం అయిన నెల‌రోజుల‌కు భ‌ర్త‌లో మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడాకులు తీసుకుంది. అనంత‌రం మంజుల జీవ‌నోపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లి 8 నెల‌ల క్రితం తిరిగివ‌చ్చింది.

తిల‌క్‌న‌గ‌ర్‌కు చెందిన మ‌న్నూరు హ‌రి దూర‌పు బంధువు. పెయింటింగ్ ప‌ని చేసే అత‌డు.. మంజుల‌ను ప్రేమించాన‌ని ఆమెతో పెళ్లి చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టి న‌వంబ‌ర్‌లో వివాహాం చేసుకున్నాడు. మ‌ద్యానికి బానిస కావ‌డంతో పాటు అనుమానంతో మంజుల‌ను వేదించ‌సాగాడు. ఈ నేప‌థ్యంలో ఆమెను హ‌త్య చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. మూడు రోజుల క్రిత‌మే కాపురాన్ని బ‌ద్వేలులోని సుంద‌ర‌య్య కాల‌నీలోకి మార్చాడు. శ‌నివారం తెల్ల‌వారు జామున మంజుల‌ను క‌త్తితో దారుణంగా హ‌త‌మార్చాడు. అనంత‌రం తాను కూడా ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు నాట‌కానికి తెర‌లేపాడు. చాతీపై చిన్న‌పాటి గాయం చేసుకున్నాడు. భార్య మృత‌దేహాం ప‌క్క‌నే ప‌డుకుని సెల్పీ తీసుకుని కుటుంబ స‌భ్యుల‌కు, పంపించాడు. విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో అదుపులోకి తీసుకుని ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.




Next Story