యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య కలకలం.. సస్పెండ్ అయిన హోంగార్డును

యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య కలకలం.. సస్పెండ్ అయిన హోంగార్డును.. యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. తుర్కపల్లి గుప్తనిధుల కేసులో సస్పెండ్ అయిన హోంగార్డు రామకృష్ణ చనిపోయారు. ఊహించని విధంగా రామకృష్ణ శవమై కనిపించడంతో కుటుంబసభ్యులు దిగ్బ్రాంతి చెందారు.

By Medi Samrat  Published on  17 April 2022 7:46 AM GMT
యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య కలకలం.. సస్పెండ్ అయిన హోంగార్డును

యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. తుర్కపల్లి గుప్తనిధుల కేసులో సస్పెండ్ అయిన హోంగార్డు రామకృష్ణ చనిపోయారు. ఊహించని విధంగా రామకృష్ణ శవమై కనిపించడంతో కుటుంబసభ్యులు దిగ్బ్రాంతి చెందారు. రెండ్రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన రామకృష్ణ తిరిగి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబసభ్యులు మిస్సింగ్ కేసు పెట్టారు. రామకృష్ణని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇంతలోనే శవమై కనిపించాడు. దీన్ని పరువు హత్యగా భావించారు పోలీసులు. 2020, ఆగస్టు 16న భార్గవి అనే యువతిని రామకృష్ణ ప్రేమవివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప. హోంగార్డుగా సస్పెండ్ అయిన తర్వాతి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. రామకృష్ణ భార్గవిని పెళ్లాడటం ఆమె మేనమామ వెంకటేష్ కు ఇష్టం లేదు. దాంతో రామకృష్ణను హత్య చేసేందుకు రౌడీ షీటర్ లతీఫ్ కు సుపారీ ఇచ్చాడు. సుపారీ తీసుకున్న వ్యక్తి రామకృష్ణను ట్రాప్ చేసి, కిడ్నాప్ చేసి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

2020, ఆగస్టు 16న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప. తుర్కపల్లిలో గుప్తనిధుల తవ్వకాల కేసులో హోంగార్డ్‌ రామకృష్ణ సస్పెండ్‌ అయ్యాడు. అప్పటినుంచి రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయిన రామకృష్ణ మళ్లి తిరిగి రాలేదు. కంగారుపడ్డ కుటుంబసభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య కలకలం.. సస్పెండ్ అయిన హోంగార్డునురామకృష్ణ కోసం పోలీసులు గాలిస్తుండగానే మెదక్‌ జిల్లా కుక్కునూర్‌పల్లి లగ్గారంలో శవమై కనిపించాడు. భార్గవి ప్రేమ పెళ్లి చేసుకోవడం ఆమె మేనమామ వెంకటేష్‌కు నచ్చలేదు. వీఆర్వోగా పనిచేసే వెంకటేష్‌ రామకృష్ణను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. రౌడీషీటర్‌ లతీఫ్‌ను కాంటాక్ట్‌ అయ్యాడు. భారీ మొత్తాన్ని సుపారీ కింద ఇచ్చాడు. దీంతో ప్లాన్‌ ప్రకారం మాజీ హోంగార్డ్‌ రామకృష్ణను కిడ్నాప్‌ చేశాడు లతీఫ్‌. ఆ తర్వాత హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. రియల్ ఎస్టేట్ భూమి చూపించాలని లతీఫ్ రామకృష్ణను హైదరాబాద్ కు తీసుకెళ్లాడు. అనంతరం కిడ్నాప్ చేసి హత్యచేసినట్లు తెలిపారు.

Next Story
Share it