ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ అరెస్ట్

Hindupuram MLA Balakrishna PA arrested.హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు(పీఏ) బాలాజీ ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 March 2022 9:44 AM IST
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ అరెస్ట్

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు(పీఏ) బాలాజీ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రా- కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని చిక్‌ బళ్లాపూర్‌ జిల్లా గౌరీబిదనూరు తాలూకా పరిధిలోని నగిరిగెర వ‌ద్ద క‌ర్ణాట‌క పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న‌ట్లు ప‌క్కా స‌మాచారం అంద‌డంతో కర్ణాటక స్పెషల్ టాస్క్‌పోర్స్ పోలీసులు నగిరిగెర వ‌ద్ద గ‌ల బీఎన్‌ఆర్‌ రెస్టారెంట్ పై దాడులు చేశారు. ఈ దాడుల్లో బాల‌కృష్ణ పీఏ బాలాజీతో పాటు 19 మందిని అరెస్టు చేశారు.

వీరి వ‌ద్ద నుంచి రూ.1.56లక్ష‌ల న‌గ‌దు, ఎనిమిది కార్లు స్వాధీనం చేస్తున్నారు. పట్టుబడ్డవారిలో వైసీపీ, టీడీపీలకు చెందినవారున్నారు. బాలకృష్ణ పీఏ బాలాజీతో పాటు హిందూపూరం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ శ్రీరామ్ రెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిని క‌ర్ణాట‌క‌లోని చిక్ బ‌ళ్లాపూర్ జిల్లా గుడిబండ కోర్టులో హాజ‌రుప‌ర‌చగా.. కోర్టు రిమాండ్ విధించింది. ప్ర‌స్తుతం ఈ విష‌యం హాట్ టాఫిక్‌గా మారింది.

Next Story