ప్రేమ పేరుతో లైంగిక వేధింపులు.. 9వ తరగతి బాలిక ఆత్మహత్య

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మోసపోయిన ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది.

By అంజి  Published on  2 Aug 2024 3:45 PM IST
harassment, love, suicide, Medchal

ప్రేమ పేరుతో లైంగిక వేధింపులు.. 9వ తరగతి బాలిక ఆత్మహత్య

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మోసపోయిన ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో చీకట్లు అలుముకున్నాయి. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్‌లో నివాసముంటున్న శారద, కుమార్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

పెద్ద అమ్మాయి శాలిని (16) చదువు నిమిత్తం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 9వ తరగతి చదువుకుంటూ హాస్టల్‌లో ఉంటోంది. ఇటీవల కొన్ని కారణాల వల్ల బాలిక.. బాలాజీ నగర్‌లోని తన ఇంటికి వచ్చింది. అయితే అదే సమయంలో బాలాజీ నగర్‌లో నివాసం ఉంటూ కూల్ డ్రింక్ షాప్‌లో పనిచేస్తున్న శివ(20) అనే యువకుడు ప్రేమ పేరుతో బాలికను లైంగికంగా వేధించాడు.

రోజు రోజుకి అతని వేధింపులు మితిమీరి పోవడంతో అది భరించలేక శాలిని గత రాత్రి ఉరి వేసుకుని చనిపోయింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించారు.

Next Story